చంద్రబాబు నాయుడు పాలనలో రైతుల సుభిక్షంగా ఉండాలి

చంద్రబాబు పాలనలో రైతులు సుభిక్షంగా ఉండాలి
- మత్స్యకార కుటుంబాలతో కలిసి పండుగ జరుపుకోవడం సంతోషంగా వుంది.
- ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
కోవూరు నియోజకవర్గ ప్రజానీకం సుఖ సంతోషాలతో వుండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆకాంక్షించారు. విడవలూరు మండలం రామతీర్ధం సమీపంలోని వెంకటనారాయణ పురంలో కనుము మత్స్యకార కుటుంబాలతో కలిసి ఆమె కనుము పండుగ సందర్బంగా నిర్వహించే పోలేరమ్మ పొంగళ్ళ కార్యక్రమంలో పాల్గొన్నారు. సాంప్రదాయ బద్ధంగా తలపై పొంగలి కుండ పెట్టుకొని పోలేరమ్మ అమ్మకు సమర్పించి అమ్మవారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ తాను భారీ మెజారిటీ ఎమ్మెల్యే గెలవడంలో మత్స్యకార సోదర సోదరీమణులు కృషి వుందన్నారు. రామతీర్ధం నుంచే తాను తొలి ఎన్నికల ప్రచారం చేసిన విషయాన్ని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చందబాబు పాలనలో రైతులు సుభిక్షంగా సుఖసంతోషాలతో వున్నారన్నారు. నియోజకవర్గ ప్రజానీకానికి ఆమె సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేసారు.ఈ కార్యక్రమంలో విడవలూరు మండల టిడిపి నాయకులు బెజవాడ వంశీ కృష్ణా రెడ్డి, ఆవుల వాసు మత్స్యకార కుల పెద్దలైన పెద్ద కాపులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






