ఘనంగా పోలీస్ శునకం పదవీ విరమణ కార్యక్రమం

పోలీసు శునకం పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించిన చిత్తూరు జిల్లా ఆర్మ్డ్ రిజర్వు పోలీసులు.
జనసాక్షి : చిత్తూరు పట్టణం లోని డాగ్ స్క్వాడ్ విభాగం ఆవరణలో అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్. శ్రీ జి.నాగేశ్వర రావు గారి ఆధ్వర్యంలో బిందు అనే పోలీస్ శునకం పదవీ విరమణ జరిగింది. దాదాపు పదకొండు ఏళ్ళ పాటు పోలీసు డిపార్టుమెంటు కు సేవలందించిన బిందు అనే పోలీసు శునకం ఈ రోజు పదవీ విరమణ చేసింది.
పదవీ విరమణ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా విచ్చేసిన జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్. మణికంఠ చందోలు, IPS గారు పదవీ విరమణ పొందుతున్న బిందు, పోలీసు శునకం శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు విధుల్లో బిందు చేసిన సేవలను కొనియాడారు. పలు కేసుల దర్యాప్తుల్లో తారా సహకారం మరువలేమని ప్రశంసించారు..
బిందు వివరాలు
బిందు 22-01-2013 లో జన్మించింది.
ఇది ల్యబ్రడార్ జాతి శునకం( స్నిఫ్ఫెర్ డాగ్ )
బిందు VIP మరియు VVIP కార్యక్రమాల యందు మెరుగ్గా సేవలు అందించింది. ముఖ్యమైన దేవాలయాలు అయిన కాణిపాకం, తిరుమల యందు బ్రహ్మొత్సవాలు సమయాలలో సంఘ విద్రోహ చర్యల నివారణ కొరకు దీని సేవలు ఉపయోగించేవారు. పలు కీలకమైన కేసుల యందు దీని సహకారం ఉపయోగకరమైనది. అలానే పోలీసు విధులలో భాగమైన ఎన్నికలలో చురుగ్గా పాల్గోనింది. తన అనుగుణమైన శైలితో ఉన్నతమైన సేవలు పోలీసు డిపార్టుమెంటుకు అందించింది. పోలీస్ డ్యూటీ మీట్ నందు బిందు తన ప్రతిభను కనబరిచి గోల్డ్ మెడల్ కూడా సాధించాయి.
ఈ కార్యక్రమానికి ఎస్పీ గారితో పాటు అడిషనల్ ఎస్పీ ఏ.ఆర్.శ్రీ జి.నాగేశ్వర రావు, ఏఆర్ డిఎస్పి శ్రీ మహూబ్ బాష, RI శ్రీ సుధాకర్ తదితరులు హాజరయ్యారు.
What's Your Reaction?






