విద్యుత్ షాక్ తో అన్నదమ్ములు మృతి

విద్యుత్ షాక్ తో అన్నదమ్ములు మృతి
గిద్దలూరు : ప్రకాశం జిల్లా గిద్దలూరు లో సోమవారం విషాదం చోటుచేసుకుంది. ఓ శుభకార్యానికి ఆటోలో సప్లయర్స్ సామాన్లు తరలించి తిరిగి తీసుకు వెళుతున్న క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ నీటి మోటర్ వైర్లు ఆటోకు తాకి విద్యుత్ సరఫరా కావడంతో ఆటలో ఉన్న అన్నదమ్ములు శీలం లోహిత్ (18) శీలం సాయి (16) అక్కడికక్కడే మృతి చెందారు. మొదట కుటుంబ సభ్యులు అన్నదమ్ములను ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు కానీ అప్పటికి ఇద్దరు మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
What's Your Reaction?






