గణపవరంలో సీఎం జగన్ కు ఘన స్వాగతం

గణపవరంలో సీఎం వైయస్ జగన్‌కు ఘన స్వాగతం
-పిల్లవాడికి ఆక్షరాభ్యాసం, తన అభిమాన స్కేచ్ కు ఆటోగ్రాఫ్
జనసాక్షి :
మేమంతా సిద్ధం బస్సు యాత్ర ద్వారా గణపవరం చేరుకున్న సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి స్థానికులు ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రికి ప్రజలు దారిపొడువున్న అపూర్వ ఘన స్వాగతం పలుకుతున్నారు. ప్రజలతో మమేకమవుతూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు. నిడమర్రు చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్ బస్సుయాత్రకు పల్లెలు- అడుగడుగునా అక్కచెల్లెమ్మల నీరాజనాలు పలికారు. తన కోసం వేచి చూస్తున్న అక్కచెల్లెమ్మలను, అవ్వాతాతలను బస్సు దిగి స్వయంగా పలకరిస్తున్న ముఖ్యమంత్రి వైయస్.జగన్. సీతారామపురం చేరుకున్న సీఎం వైయస్ జగన్ బస్సుయాత్రకు మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు. హారతులు పట్టి ఆత్మీయ స్వాగతం పలికారు. గణపవరం సెంటర్‌లో తన కోసం ఎదురుచూస్తున్న జన సందోహానికి సీఎం వైయస్ జగన్ అభివాదం చేశారు.
What's Your Reaction?






