కన్నుల పండగ గా శ్రీ అయ్యప్ప స్వామి దీక్షపరుల అగ్నిగుండ
కందుకూరు :జన సాక్షి : కందుకూరు శ్రీ అయ్యప్ప స్వామి ఆలయంలో కార్తీకమాస వైభవ కార్యక్రమంలో భాగంగా శనివారం రాత్రి అయ్యప్ప స్వాముల దీక్షపరుల అగ్ని ఉండు ప్రవేశం కన్నుల పండుగ జరిగింది. తొలుత శ్రీ అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయము నుంచి భక్తిశ్రద్ధలతో ఉపవాస దీక్ష ఉన్న అయ్యప్ప స్వాములు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. వందలాదిమంది అయ్యప్ప దీక్ష మారధారణ స్వాములు అగ్నిగుండ ప్రవేశం చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి సేవా సంఘం సభ్యులు, మాలధారణ స్వాములు పాల్గొన్నారు.
What's Your Reaction?






