తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సుదర్శన నరసింహ యాగం

తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో.... సుదర్శన నారసింహ యాగం
జనసాక్షి : కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు, సౌజన్య దంపతులు గురువారం సుదర్శన నారసింహ యాగం నిర్వహించారు.
కదుకూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన క్రతువుకు.. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తిలకించారు.
అత్యంత ప్రజాదరణ పొంది, తద్వారా విఘ్నాలను తొలగించుకుంటూ... చేపట్టబోయే ప్రతి కార్యంలోనూ ఘనవిజయం సాధించడమే.... ఈ సుదర్శన నారసింహ యాగం అంతరార్థం.
ఈ సందర్భంగా గణపతి పూజ, సుదర్శన ఆరాధన, నవగ్రహ ఆరాధన, అష్టదిక్పాలక ఆరాధన, సుదర్శన స్నపన తిరుమంజనం, పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రోచ్ఛారణల మధ్య పరిసమాప్తం చేశారు.. త్వ
రలో జరగబోయే ఎన్నికల్లో ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందాలని... యాగంలో పాల్గొన్న 11 మంది రుత్వికులు ఆయనకు సంపూర్ణ ఆశీర్వచనాలు అందజేశారు.
What's Your Reaction?






