క్రీడలు మనోబలాన్ని పెంచుతాయి - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

క్రీడలు మనోబలాన్ని పెంచుతాయి
- మహిళా ఉద్యోగుల క్రీడా పోటీల బహుమతి ప్రదానోత్సవంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.
క్రీడలు శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడిని నుంచి దూరం కావడానికి సహాయ పడతాయన్నారు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నెల్లూరు నగరంలో ఎన్జిఓ హోమ్ లో నిర్వహించిన మహిళా ఉద్యోగుల క్రీడా పోటీల విజేతలకు ఆమె బహుమతి ప్రదానోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపోటములు సహజమేనని, గెలవాలి అని కృషితో ముందుకు సాగడంలోనే నిజమైన విజయం ఉంటుందన్నారు. క్రీడలు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడమే కాకుండా, టీమ్ స్పిరిట్‌ను పెంచుతాయన్నారు. ఈ బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమం ద్వారా విజేతలను గౌరవించడమే కాదు మహిళల క్రీడాస్ఫూర్తిని సన్మానించు కుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, జిల్లా ఆరోగ్యశాఖాధికారి వి సుజాత, ఉద్యోగుల సంఘ రాష్ట్ర నాయకులు కర్నాటి వెంకట శివారెడ్డి,రామకృష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






