నేతన్నల కోసం టెక్స్ టైల్స్ పార్క్ నిర్మించండి - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Mar 7, 2025 - 14:58
Mar 7, 2025 - 15:00
 0  143
నేతన్నల కోసం  టెక్స్ టైల్స్ పార్క్ నిర్మించండి - ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

నేతన్నల కోసం టెక్స్‌టైల్‌ పార్క్ నిర్మించండి

సుప్రసిద్ధ పాటూరు జరీ చీరలు తయారఅయ్యే కోవూరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికవడం భగవత్ సంకల్పం అన్నారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి . చేనేత రంగాన్ని బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యల గురించి శుక్రవారం ఆమె శాసనసభలో ప్రస్తావించారు. గతంలో సంగీత స్వరాలలా వినిపించే మగ్గాల చప్పుళ్ళు గత ప్రభత్వ నిర్వాకాలతో మోగబోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చాక నేతన్నలలో మళ్ళీ ఆశలు చిగురించాయని మంత్రి లోకేష్  మంగళగిరిలో చేనేతల సంక్షేమం కోసం చేపట్టిన విన్నూత్న పధకాలు రాష్ట వ్యాప్తంగా విస్తరింప చేయాలని కోరారు. కోవూరు నియోజకవర్గంలోని పాటూరు పరిసర గ్రామాలలో పద్మశాలి, దేవాంగ, కైకాల, తొగట లాంటి 9 ఉప కులాల వారు 40 వేల వరకు వున్నారని చేనేత వృత్తి పై ఆధారపడి జీవనం సాగించే నేతన్నల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో 76 లక్షలతో మంజూరైన మిని క్లస్టర్ లో భాగంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరానికి గాను 20 లక్షలు విడుదల అయ్యాయన్నారు. అందుకు సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గార్లకు ఆమె ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. నేతన్నలను ఆర్ధికంగా ఆదుకునే చేనేత సహకార సొసైటీలు రాష్ట వ్యాప్తంగా 45 ఏర్పాటు కాగా కోవూరు నియోజకవర్గంలో 3 వున్నాయని వారికి ముడి సరకు, మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని కోరారు. చేనేత రంగంలో అత్యాధునిక డిజైన్లకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞ్యానాన్ని అభివృద్ధి చేసి కోవూరు ప్రాంతంలో టెక్స్‌టైల్‌ పార్క్ ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికుల ప్రయోజనార్ధం నిర్మించ తలపెట్టిన చేనేతభవనానికి సంబంధించిన స్థలం ఆక్రమణకు గురై వుందని దాన్ని అక్రమార్కుల చెర నుంచి విడిపించి కోవూరు నియోజకవర్గంలో చేనేత భవనం నిర్మించాలని ఆమె అభ్యర్ధించారు. ఆరోగ్య భీమాతో పాటు చేనేతలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీల పురోగతిపై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు శాసనసభలో అడిగిన ప్రశ్నకు రాష్ట చేనేత శాఖా మంత్రి సవిత సమాధానమిస్తూ హామీలకు సంబంధించి అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిపారు. చేనేత కార్మికులకు NHDC ద్వారా సబ్సిడీ రుణాలతో పాటు 50 సంవత్సరాలకే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సదుపాయం కలిపించినట్టు వివరించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow