స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవం లో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎంపీ వేమిరెడ్డి
- ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ గారికి ఆహ్వానం పలికిన ఎంపి
- పాల్గొన్న మంత్రులు నారాయణ, ఆనం తదితరులు
గ్రామీణ సాధికారతే లక్ష్యంగా పనిచేస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవం అట్టహాసంగా సాగింది. అతిరథ మహారధులు పాల్గొన్న ఈ వార్షికోత్సవం ఉత్సాహంగా సాగింది. భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ దంపతులు, మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు దంపతులు, రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరైన ఈ వేడుకలో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా నెల్లూరులోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌కు చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి . రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని మర్యాదపూర్వకంగా కలిసి పలు అంశాలపై మాట్లాడారు. అనంతరం గవర్నర్ తో కలిసి పోలీసు పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక హెలికాప్టర్‌లో పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగ్‌దీప్ ధన్‌ఖడ్ దంపతులకు ఎంపీ వేమిరెడ్డి ఆహ్వానం పలికారు. పరేడ్ గ్రౌండ్ నుంచి రోడ్డు మార్గంలో వెంకటాచలం చేరుకున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి .. స్వర్ణభారత్ ట్రస్ట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించి అందుతున్న సేవలపై అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని ఆప్యాయంగా పలకరించారు. అనంతరం నిర్వహించిన స్వర్ణభారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు.
What's Your Reaction?






