స్నేహ మధురిమలు పుస్తకం ఆవిష్కరణ

Sep 25, 2023 - 19:19
Sep 25, 2023 - 19:25
 0  21
స్నేహ మధురిమలు పుస్తకం ఆవిష్కరణ
  • స్నేహ మధురిమలు పుస్తకం ఆవిష్కరణ
     కందుకూరు జనార్ధన స్వామి  కళ్యాణ మండపంలో ఆదివారం   రచయిత ఇనకోల్లు మస్తానయ్య రచయించిన వచన,గేయ,కధాసంపుటి స్నేహ మధురిమలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన పుస్తక  సమీక్షా  సభలో సాహిత్య వేత్తలు సాహిత్యకారులు మాట్లాడుతూ ఇనకోల్లు మస్తానయ్య రచయించిన పుస్తకం తన స్వీయ అనుభవాలు జ్ఞాపకాలు ఈ పుస్తకంలో పొందుపరిచారన్నారు. స్నేహం అంటే మధురమైనదని జీవితంలో ప్రతి ఒక్కరికీ పాఠశాల నుంచి స్నేహం మొదలవుతుంది. చిన్ననాటి స్నేహం కలకాలం నిలిచి ఉం టుందని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈకార్యక్రమానికి గణపతి రాజు శేషగిరిరావు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా యు.వి రత్నం, భాస్కరమూర్తి, వి.వి.శేషయ్య, చెరుకూరి శ్రీనివాసులు, గాండ్లహరిప్రసాద్, బి.వి.రమణ, ఎ.పద్మావతి, వేల్పుల ప్రభుదాసు, బొబ్బా శ్రీరామమూర్తి ,పానుగంటి వెంకటేశ్వర్లు, సి.హెచ్.సుబ్బారావు, జి.వెంకటస్వామి, నల్లమల్లి శేషు, వాడపల్లి భాస్కరరావు, ముప్పవరపు కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow