అయోధ్యలో పునరుద్ధరించిన అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

Dec 31, 2023 - 13:43
 0  48
అయోధ్యలో  పునరుద్ధరించిన అయోధ్య ధామ్  రైల్వే స్టేషన్  ను ప్రారంభిస్తున్న  ప్రధాని మోదీ

 జనసాక్షి : అయోధ్యలో పునరుద్ధరించిన అయోధ్యధామ్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ

అయోధ్య, డిసెంబరు 30 జాల్నా–ముంబై మధ్య నడిచే వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రధాని మోదీ పచ్చజెండా ఊపారు. శనివారం అయోధ్యలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని వర్చువల్‌గా ఈ రైలును ప్రారంభించారు. మధ్యాహ్నం 12.12 గంటలకు జాల్నా నుంచి బయలుదేరిన వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌.. 400 కి.మీ. ప్రయాణించి సాయంత్రం 7 గంటలకు ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్‌ స్టేషన్‌కు చేరుకుంది. ఇప్పటి వరకు ప్రధాని మోదీ ప్రారంభించిన వందే భారత్‌ రైళ్లలో ఇది ఆరోది.

జాల్నా–ముంబై వందే భారత్‌..

మహర్షి వాల్మీకి విమానాశ్రయాన్ని, ఆధునిక హంగులతో పునరుద్ధరించిన అయోధ్యధామ్‌ రైల్వేస్టేషన్‌ను ప్రారంభించారు. అనంతరం 2 అమృత్‌ భారత్‌, 6 వందేభారత్‌ రైళ్లకు ఆయన జెండా ఊపారు. అలాగే రూ.15,700 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోదీ ప్రసంగించారు. జనవరి 22న అయోధ్యకు వచ్చి రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి అందరూ ఆసక్తిగా ఉన్నారని, కానీ ఇదిసాధ్యం కాదని మీకూ (ప్రజలకు) తెలుసన్నారు. ఆహ్వానాలు అందినవారు మాత్రమే ఆ రోజు రావాలని, మిగిలినవారు మరుసటి రోజు నుంచి రావాలని చేతులు జోడించి ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. రాముడి దర్శనానికి ఇప్పటికే 550ఏళ్ల పాటు ఎదురుచూశామని, మరికొద్ది రోజుల్లో ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయ్యే వరకూ భక్తులు ఓపిక పట్టాలని కోరారు. భద్రతా కారణాల దృష్ట్యా ఈ వినతి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఒకసారి అయోధ్యలో నిర్మించిన నవ్య, భవ్య, దివ్యమైన ఆలయం తెరుచుకున్న తర్వాత శతాబ్దాలపాటు ప్రజలు రాముడిని దర్శించుకోవచ్చని తెలిపారు. ‘‘ఆయోధ్యలోని ఈ పవిత్ర భూమిపై నుంచి 140కోట్ల మంది దేశ ప్రజలను ప్రార్థిస్తున్నాను. 22న అయోధ్యలో శ్రీరామ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగే సమయంలో మీరు కూడా మీ ఇళ్లల్లో ప్రార్థనలు చేయాలి. ఆ రోజు సాయంత్రం దేశమంతటా శ్రీరామ జ్యోతి వెలిగించి, దీపావళి వేడుకలు జరుపుకోవాలి’’ అని ప్రధాని పిలుపునిచ్చారు. ‘‘ఒకప్పుడు రామ్‌లల్లా ఈ అయోధ్యలోనే ఒక చిన్న గుడారం కింద నివసించేవారు. ఇప్పుడు ఆయనకు పక్కా ఇంటిని నిర్మించాం. ఆయనతోపాటు దేశంలో 4కోట్ల మందికి పక్కా ఇళ్లు లభించాయి’’ అని మోదీ తెలిపారు. రామమందిర ప్రారంభోత్సవం కోసం ప్రపం చం మొత్తం ఎదురుచూస్తోందన్నారు. రాముడి దర్శనం కోసం దేశంతోపాటు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం పెద్దసంఖ్యలో ప్రజలు తరలివస్తారని పేర్కొన్నారు. అయోధ్యను అత్యంత పరిశుభ్రమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేయాలని, అది ఈ నగరవాసుల బాధ్యతన్నారు. జనవరి 14 నుంచి 22 వరకు దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, ఆలయాల్లో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టాలని మోదీ కోరారు.

భారీ రోడ్‌ షోశ

నివారం ఉదయం ఆధ్యాత్మిక నగరానికి చేరిన ప్రధాని ఎయిర్‌పోర్టు నుంచి రైల్వేస్టేషన్‌ వరకు 8 కి.మీమేర నిర్వహించిన భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. పెద్దసంఖ్యలో ప్రజలు హాజరై పూలవర్షం కురిపిస్తూ ఆయనకు ఘనస్వాగతం పలికారు. వీరిలో అయోధ్య కేసు కక్షిదారు ఇక్బాల్‌ అన్సారి కూడా ఉండటం విశేషం. జనం ‘జై శ్రీరామ్‌’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. దారి పొడవునా సాంస్కృతిక బృందాల ప్రదర్శనను ప్రధాని వీక్షించారు. ఈ సందర్భంగా ప్రధానితో సెల్ఫీలు తీసుకునేందుకు యువత పెద్ద ఎత్తున ఆసక్తి చూపారు. పలువురితో సెల్ఫీలు దిగారు. మరికొందరికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చారు. మోదీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తదితరులు ఉన్నారు.

రామయ్యకు 300 టన్నుల సుగంధ బియ్యం

రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఛత్తీస్‌గఢ్‌ నుంచి 300టన్నుల సుగంధ బియ్యం లోడు అయోధ్యకు బయల్దేరింది. ఈ రాష్ట్రంలోని చాంద్‌ఖురీ గ్రామం రాముడి తల్లి కౌసల్య జన్మస్థలంగా భావిస్తారు. శనివారం రాయ్‌పూర్‌ వీఐపీ రోడ్డులోని శ్రీరామ మందిరం వద్ద జరిగిన కార్యక్రమంలో సీఎం విష్ణుదేవ్‌ సాయి బియ్యం లోడుతో కూడిన 11 ట్రక్కులను కాషాయ జెండా ఊపి ప్రారంభించారు. ఛత్తీస్‌గఢ్‌ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ‘సుగంధ బియ్యం సమర్పణ కార్యక్రమం’ పేరుతో ఈ బియ్యాన్ని పంపుతున్నట్టు అధికారులు వెల్లడించారు. రాముడి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఈ బియ్యాన్ని ప్రసాదంగా వినియోగించాలని సూచించామని తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow