వైయస్. షర్మిల పర్యాటన ఖరారు

Jan 20, 2024 - 12:11
Jan 20, 2024 - 12:13
 0  231
వైయస్. షర్మిల పర్యాటన ఖరారు

వైఎస్ షర్మిల ఏపీ పర్యటన ఖరారు...

 జనసాక్షి  : వైఎస్. షర్మిల రెండు రోజుల ఏపీ పర్యటన ఖరారైంది. 20వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి సాయంత్రం 4 గంటలకు వైఎస్ ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. ఆ రోజు రాత్రి ఇడుపులపాయలో బస చేసి 21వ తేదీ ఉదయం కడప నుంచి విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు.ఉదయం 11 గంటలకు విజయవాడలో ఆమె పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో షర్మిలకు పార్టీ అధిష్టానం బాధ్యతలు అప్పగించి, వచ్చే ఎన్నికలకు ముందు రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఏపీసీసీ చీఫ్‌గా నియమించింది. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా ఏపీసీసీ మాజీ చీఫ్‌ గిడుగు రుద్రరాజ్‌ను నియమించారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow