రాళ్లపాడు ప్రాజెక్టు కుడి కాలువ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం

రాళ్ళపాడు ప్రాజెక్టు కుడి కాలువ పనులను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే దివి శివరాం
రాళ్ళపాడు ప్రాజెక్టు కుడి కాలువ వద్ద జరుగుతున్న మరమ్మత్తుల పనులను మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం శుక్రవారం పరిశీలించారు. సుమారు 15 రోజుల క్రితం కుడి కాలువ గేటు మరమ్మత్తులకు గురైంది. గేటు సుమారు నీటిలో 20 అడుగుల లోతులో కూరుకుపోయింది. దీంతో కుడి కాలువ ఆయకట్టు క్రింద ఉన్న రైతులకు పూర్తిస్థాయి నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడింది. గేటును పైకి లేపడానికి అధికారులు విఫలయత్నాలు చేసిన సాధ్యపడలేదు. ఈ నేపథ్యంలో రంగం లోకి దిగిన మేఘా సంస్థ మోటార్ల ద్వారా కుడికాలువకు నీరు అందించే పనులు చేపట్టింద. ఈ పనులను మాజీ ఎమ్మెల్యే, కందుకూరు నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ దివి శివరాం తో పాటు కమిటీ సభ్యులు పరిశీలించారు.
What's Your Reaction?






