విజయదశమి సందర్భంగా స్వర్ణాభరణాలతో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీ అంకమ్మ తల్లి

కందుకూరు శ్రీ శ్రీ అంకమ్మ తల్లి అమ్మవారు విజయదశమి పర్వదినం సందర్భంగా స్వర్ణాభరణాలతో దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిచ్చారు. మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డి అమ్మవారి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి చేసిన కృషి అసామాన్యం. భక్తులు కలలో కూడా ఊహించని విధంగా అపురూపంగా అమ్మవారి ఆలయం రూపుదిద్దుకుంది. ఆలయ శిఖరాన స్వర్ణ కలిశాలు, అమ్మవారికి స్వర్ణాభరణాలు అన్నీ మహీధర్ రెడ్డి సంకల్ప బలంతో చేకూరినవే.. ఆయనకు ఆ తల్లి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి.
రూ.4 కోట్ల వ్యయంతో చేపట్టిన అనివేటి మండపం.. 3 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలనుకున్న 5 అంతస్తుల రాజగోపురం.. ప్రహరీ గోడ.. ఆలయ ఆవరణలో ఆహ్లాదకరమైన పచ్చదనం.. ఆధ్యాత్మికతలో ఓలలాడించేలా భక్తి సంగీతం.. వంటివి అన్ని సమకూరితే ఇంకా ఎంతో..ఎంతో అద్భుతంగా ఉంటుంది. మహీధర్ రెడ్డి సంకల్ప బలంతో అనివేటి మండపం త్వరలో పూర్తవుతుంది. అమ్మవారి దీవెనలతో మిగిలినవి కూడా కార్యరూపం దాల్చాలి.
What's Your Reaction?






