దసరా సెలవులకు ఊళ్ళకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి

Oct 6, 2024 - 17:34
 0  31
దసరా సెలవులకు ఊళ్ళకు  వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి

దసరా సెలవులలో ఊళ్ళకు వెళుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త..! -జిల్లా యస్.పి. శ్రీ జి.కృష్ణకాంత్ 

దసరా పండుగ రోజుల్లో ఇళ్లకు తాళం వేసి ఊళ్లకు వెళ్లేవారు దొంగతనాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి.

లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టంను వినియోగించుకుని తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు చెక్ పెట్టండి.

LHMS యాప్ ద్వారా లేదా 9440796383 లేదా 9392903413 నంబర్ లకు లేదా స్థానిక పోలీసులను సంప్రదించి LHMS సేవలు ఉచితంగా వినియోగించుకోవచ్చు.

ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు బంగారం దొంగల బారిన పడకుండా తగు జాగ్రత్తలు వహించాలన్నారు. CCTV కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

డబ్బు మరియు విలువైన ఆభరణాలు ఇంట్లో ఉంచి వెళ్ళకూడదు. ఖరీదైన వస్తువులను బ్యాంక్‌ లాకర్‌లో పెట్టుకోవాలి.

రాత్రివేళ అనుమానంగా సంచరించేవారి గురించి, తాళం వేసిన ఇండ్ల వద్ద అపరిచిత వ్యక్తులు కనబడితే పోలీసులకు వెంటనే సమాచారం అందించాలి.

ఇంట్లో కుటుంబసభ్యులు బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో ఉన్న మహిళలు, వృద్దుల వద్దకు అపరిచితులు సమాచారం కావాలంటూ వస్తే నమ్మవద్దని, ఏమరుపాటుగా ఉండవద్దు.

విలువైన వస్తువులను పక్కింటి వారికి ఇచ్చి నమ్మి మోసపోవద్దు. ఇరుగు పొరుగు వారిని తమ ఇంటిని కనిపెట్టి ఉండమని చెప్పి వెళ్లడం మంచిది.

వీలైనంత త్వరగా ప్రయాణం ముగించుకుని వచ్చేలా చూసుకోవాలన్నారు.

పక్కింటి వారిద్వారా ఇంటికి సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి.

చుట్టు పక్కల వారి సెల్‌ఫోన్‌ నంబర్లు దగ్గర ఉంచుకోవాలి.

బయటికేల్లేటప్పుడు తాళలను ఒకటికి రెండు సార్లు సరిచూసుకోండి.

గ్రామాలకు వెళ్లే వారు ఇంట్లో ఏదో ఒక గదిలో లైటు వేసి ఉంచాలి.

అదేవిధంగా పండుగ సందర్భంగా పెద్ద పెద్ద కంపెనీలు మంచి మంచి ఆఫర్లు ఇచ్చినందున ఇదే అదునుగా భావించి సైబర్ నేరగాళ్లు డూప్లికేట్ ఐడి క్రియేట్ చేసి ప్రజలను మోసం చేస్తారు.. అవసరం లేకుండా వచ్చే మెసేజ్ లల్లో బ్లూ కలర్ లింకులను ఓపెన్ చేయవద్దు. అప్రమత్తంగా వుండాలన్నారు. సైబర్ నేరానికి గురైన వారు వెంటనే 1930 కి కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు.

జిల్లా పోలీసు కార్యాలయం, తేది.06.10.2024.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow