బిపిఎల్ కంపెనీ ఏర్పాటుతో జిల్లాకు మహార్దశ

బీపీసీఎల్ కంపెనీ ఏర్పాటుతో జిల్లాకు మహర్దశ
నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రామాయపట్నం సమీపంలో 95 వేల కోట్ల పెట్టుబడితో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బిపిసిఎల్) రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కంపెనీ ఏర్పాటు కానుండటం చాలా సంతోషకర విషయమని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీపీసీఎల్ కంపెనీ ఏర్పాటు కానుండటం జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణమని, పారిశ్రామికంగా జిల్లా స్వరూపం పూర్తిగా మారిపోతుందని వివరించారు. తాను ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాలో, తన హయాంలో ఇంత భారీ పరిశ్రమ ఏర్పాటు కావడం చాలా గర్వకారణంగా ఉందని చెప్పారు.
బీపీసీఎల్ పరిశ్రమ నెల్లూరు జిల్లాలో ఏర్పాటు అయ్యేలా శ్రమించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. చంద్రబాబు మార్గ నిర్దేశంలో రాష్ట్రం పురోభివృద్ధి దిశగా సాగుతోందని సంతోషం వ్యక్తం చేశారు. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపుతున్నారని కొనియాడారు. ఆయన దార్శనికతతో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్నారు. అలాగే బీపీసీఎల్ కంపెనీ నెల్లూరు జిల్లాకు రావడంలో చొరవ చూపిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ఎంపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బిపిసిఎల్ ద్వారా జిల్లాలో పారిశ్రామికంగా ఎంతో మేలు జరుగుతుందని, కంపెనీ ఏర్పాటుతో ప్రత్యక్ష్యంగా 5 వేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. కంపెనీ నిర్మాణ సమయంలో దాదాపు 1 లక్ష మందికి ఉపాధి దొరుకుతుందని వెల్లడించారు. బిపిసిఎల్ కంపెనీ 5 వేల ఎకరాల్లో ఏర్పాటు కానుండగా.. తొలిగా ప్రాజెక్టు ముందస్తు కార్యకలాపాల కోసం 6100 కోట్లు కేటాయించారన్నారు. దశల వారీగా దాదాపు 95 వేల కోట్లు పెట్టుబడులు పెట్టడం రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాలో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకుని ఇంత భారీ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన బిపిసిఎల్ కంపెనీ ప్రతినిధులకు ఎంపీ వేమిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. బిపిసిఎల్ కంపెనీతో పాటు 15 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయని వివరించారు.
-అనుబంధ పరిశ్రమలు..
పెట్రోకెమికల్ ప్లాంట్, లూబ్రికెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్, ఫ్యుయల్ అడిటివ్స్, వ్యాక్స్ ప్రొడక్షన్, ఆఫాల్ట్ ప్రొడక్షన్, సర్ఫర్ రికవరీ ప్లాంట్, కెటలిస్ట్ మానుఫ్యాక్చరింగ్, రిఫైనరీ మెయింటెనెన్స్ సర్వీస్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్, ఎన్‌విరాన్‌మెంటల్ సర్వీస్, ట్యాంక్ మానుఫ్యాక్చరింగ్, పైప్ మానుఫ్యాక్చరింగ్, వాల్వ్ మానుఫ్యాక్చరింగ్, ఇన్‌సులేషన్ అండ్ రిఫ్రాక్టరీ సర్వీస్, లాజిస్టిక్ అండ్ ట్రాన్స్‌పోర్టేషన్ వంటి 15 అనుబంధ పరిశ్రమలు ఏర్పడి లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. జిల్లా సమగ్రాభివృద్ధి చెందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే జిల్లా ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చేందుకు ఎంపీగా తనవంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు.
What's Your Reaction?






