ప్రపంచ తెలుగు సమైక్య 12 వ దైవార్షిక సమావేశాలు అట్టహాసంగా ప్రారంభం

Jan 4, 2025 - 16:01
 0  38
ప్రపంచ తెలుగు సమైక్య 12 వ దైవార్షిక  సమావేశాలు  అట్టహాసంగా ప్రారంభం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు మాట్లాడే సమాజాన్ని ఏకం చేయాలనే దృక్పథంతో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) 12వ ద్వైవార్షిక సమావేశాలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌ లోని హెఐసీసీ వేదికగా శుక్రవారం ప్రారంభమైన ఈ సమావేశాలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య (WTF) సమావేశాలు 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరగనున్నాయి. తెలుగు సమాజాభ్యున్నతికి 1992 లో ప్రపంచ తెలుగు సమాఖ్య ఏర్పాటు చేయబడింది. దీనికి నెల్లూరు పార్లమెంట్‌ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు వైస్‌ ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు.

ముందుగా ప్రాంగణానికి చేరుకున్న సీఎం చంద్రబాబు నాయుడు గారికి WTF ప్రెసిడెంట్‌ వి.ఎల్‌ ఇందిరా దత్‌ గారు, వైస్‌ ప్రెసిడెంట్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ఆత్మీయ స్వాగతం పలికారు. అనంతరం వేదికపై చేరుకున్నవారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సమావేశాలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు గారిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. అనంతరం ప్రెసిడెంట్‌ ఇందిరాదత్‌గారు ప్రారంభ ఉపన్యాసం చేశారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow