రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ కి గాయాలు - తప్పిన పెను ప్రమాదం

గుడ్లూరు జనసాక్షి.
కంటైనర్ అదుపుతప్పి రోడ్డు దాటి టిప్పర్ ను ఢీ కొనడంతో కంటైనర్ డ్రైవర్ కు గాయా లయ్యాయి. ఈ సంఘటన మండలంలోని జాతీయ రహదారిపై శాంతినగర్ వద్ద బుధవారం రాత్రి జరిగింది. వివరాలు ప్రకారం విజయవాడ నుంచి ఇనుప రేకులతో చెన్నై వెళ్తున్న కంటైనర్ రాత్రి 12 గంటల సమయంలో శాంతినగర్ వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి డివైడర్ దాటి కావలి నుంచి ఒంగోలు వైపు వెళుతున్న టిప్పర్ ను బలంగా ఢీ కొట్టింది. దీంతో కంటైనర్ లారీ డ్రైవర్ నజీర్ కు గాయాలయ్యాయి. కంటైనర్ లో ఉన్న ఇనపరేకులు జాతీయ రహదారిపై పడ్డాయి. ఆ సమయంలో వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న హలో పెట్రోల్ పోలీసులు సంఘటన స్థలం కు చేరుకొని రోడ్డుకు అడ్డంగా పడిపోయిన కంటైనర్ లారీని పక్కకు తప్పించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. గాయాలైన నజీర్ ను కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. కంటైనర్ లారీ క్యాబిన్ నుజ్జు నుజ్జు అయినా డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.టిప్పర్ డ్రైవర్ కూడా స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద స్థలమును ఎస్సై వెంకట్రావు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
What's Your Reaction?






