పింఛన్ల పంపిణీకి హాజరుకానున్న సీఎం చంద్రబాబు నాయుడు

Jun 29, 2024 - 20:46
Jun 29, 2024 - 20:49
 0  141
పింఛన్ల పంపిణీకి హాజరుకానున్న సీఎం చంద్రబాబు నాయుడు

పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి హాజరుకానున్న సిఎం చంద్రబాబు

మంగళగిరి నియోజవకర్గం పెనుమాకలో పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి

అమరావతి జనసాక్షి : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జులై 1వ తేదీ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మంగళగిరి నియోజకవర్గం పెనుమాకలో ఉదయం 6 గంటలకు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సిఎం పాల్గొంటారు. అనంతరం జరిగే ప్రజావేదిక కార్యక్రమంలో భాగంగా లబ్ధిదారులు, ప్రజలతో ముచ్చటిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 65,18,496 మంది లబ్దిదారులకు రూ.4,408 కోట్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందులో భాగంగా స్వయంగా సిఎం కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎంపిలు అంతా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కానున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow