కోవూరు అభివృద్ధికి సహకరించండి
- మంత్రి నారా లోకేష్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 2025-26 బడ్జెట్ సమావేశాల సందర్బంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తో కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కొద్దిసేపు మాట్లాడారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వెళ్లిన ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి. ఈ సందర్భంగా అసెంబ్లీ లాబీలో నారా లోకేష్‌ను కలిశారు. ఈ సందర్బంగా బడ్జెట్ కేటాయింపులపై వారు మాట్లాడారు. కోవూరు నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ది, పెండింగ్ ప్రాజెక్టులను మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు. కోవూరు నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరారు. ఈ సందర్బంగా వివిధ అంశాలను ఆమె నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లారు.