రైలు ప్రమాద బాధితలకు భరోసా ఇచ్చిన సీఎం జగన్

Oct 30, 2023 - 16:44
Oct 30, 2023 - 17:05
 0  245

 జనసాక్షి  :విజయనగరం జిల్లా రైలు ప్రమాద ఘటనలో పలువురు మరణించడం బాధాకరం. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నానని సీఎం జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  ఈ ఘటనలో గాయపడి విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సోమవారం సీఎం జగన్  పరామర్శించారు . రైలు ప్రమాదంలో గాయపడిన వారు   కోలుకునేంతవరకూ ప్రభుత్వం తోడుగా నిలుస్తోందని  భరోసా ఇచ్చారు. వారికి మంచి వైద్యం అందించ‌డంతో పాటు మరణించిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు ఎక్స్‌గ్రేషియాను సత్వరమే అందించాలని అధికారులను ఆదేశించారు.

-ఏరియల్ రివ్యూ ద్వారా విజయనగరం రైలు ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించిన సీఎం జగన్.

  • ఆపదలో నేనున్నానని రైలు ప్రమాద బాధితులకు భరోసా ఇచ్చిన సీఎం జగన్

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow