రూ 4 లక్షలు పలికిన వినాయకుడి లడ్డు

రూ. 4,00,000 పలికిన వినాయకుని లడ్డు
జనసాక్షి : గణేష్ నవరాత్రులలో భాగంగా నెల్లూరు జిల్లా కందుకూరు మండలం విక్కిరాలపేటలో గణేష్ విగ్రహం ఏర్పాటు చేశారు. గత ఆరు రోజులుగా విశేష పూజలు అందుకున్న వినాయక స్వామి నిమజ్జనం సందర్భంగా గురువారం లడ్డు వేలంపాట జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసిన లడ్డూను దక్కించుకుంటే సకల సౌభాగ్యాలు లభిస్తాయన్న విశ్వాసంతో లడ్డునూ దక్కించుకునేందుకు స్థానికులు పోటీ పడ్డారు. గ్రామానికి చెందిన గుండాబత్తిన మాలకొండయ్య రూ. 4 లక్షలకు వేలంలో హెచ్చుపాట పాడి లడ్డూను దక్కించుకున్నారు. గణేష్ ఉత్సవ కమిటీ, స్థానికులు వారికి అభినందనలు తెలిపారు. అట్టహాసంగా మేళతాళాలతో ఊరేగింపుగా మాలకొండయ్య కుటుంబ సభ్యులు లడ్డును ఇంటికి తీసుకెళ్ళారు.
What's Your Reaction?






