రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద మోటార్లను పరిశీలించిన ఎమ్మెల్యే

రాళ్లపాడు ప్రాజెక్టు వద్ద మోటార్లను పరిశీలించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు
-నీరు ప్రవహించే కాలువపై అడ్డుకట్టలు వేయరాదు
-చివరి ఆయకట్టు వరకు నీరు చేరే విధంగా రైతులు సహకరించాలి.
కందుకూరు నియోజకవర్గంలో లింగసముద్రం మండలం రాళ్లపాడు ప్రాజెక్ట్ కుడికాలువ గేటు వద్ద ఏర్పాటుచేసిన మోటార్ల ను బుధవారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ఎన్ని క్యూసెక్కుల నీరు కాలువల ద్వారా దిగువ ఆయకట్టుకు ప్రవహిస్తుందో తెలుసుకున్నారు. కాలువలో నీరు ప్రవహిస్తున్న తీరును పరిశీలించారు..రైతులు ఎవరుకూడా కాలువలపై అడ్డుకట్టలు వేయకుండా అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.. అలా కాకుండా ఎవరైనా కాలువల ద్వారా నీరు ప్రవహించకుండా అడ్డుకట్టలు వేసిన, ఇంజన్ల ద్వారా నీటిని దిగువ ప్రాంతానికి పోకుండా చేసినచో అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు..రాళ్లపాడు చివరి ఆయకట్టు వరకు మీరు అందించడమే తమ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు తెలిపారు.చివరి ఆయకట్టు వరకు నీరు చేరే విధంగా రైతులందరూ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు..ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ అధికారులు మరియు కూటమి పార్టీ నాయకులు, ఆయకట్టు రైతులు పాల్గొన్నారు..
What's Your Reaction?






