టిడిపి ఎంపీలు, కేంద్ర మంత్రితో ఢిల్లీలో భేటీ అయిన సీఎం చంద్రబాబు
పాల్గొన్న నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ఎంపీ వేమిరెడ్డి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు టిడిపి ఎంపీలతో భేటీ అయ్యారు. శుక్రవారం ఢిల్లీ పర్యటన భాగంగా ఢిల్లీలోని సీఎం రెసిడెన్సిలో.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో జరిగిన భేటీలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కింజారపు రామ్మోహన్ నాయుడు , ఎంపీలతో భేటీ అయిన సీఎం చంద్రబాబు గారు వివిధ అంశాలపై వారితో చర్చించారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరు, పార్టీ బలోపేతంపై మాట్లాడారు.