యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి- ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేయండి
ఎస్సీ, ఎస్టీల వెనుకబాటుతనం పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అసెంబ్లీలో గళమిప్పారు. కోవూరు నియోజకవర్గంలోని దళిత, గిరిజన సమస్యలను ఆమె సోమవారం శానసభలో ప్రస్తావించారు. కోవూరు నియోజకవర్గంలో వున్న 138 గిరిజన కాలనీలలో దాదాపు 30 వేల వరకు గిరిజనులు వున్నారని వారిలో 90 శాతానికి పైగా దారిద్య్రరేఖకు దిగువన వున్నారని గిరిపుత్రల దయనీయ జీతాలను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి సభ దృష్టికి తెచ్చారు. నిరక్ష్యరాస్యత అవగాహనా రాహిత్యంతో పాటు చాలా మందికి ఆధార్ కార్డులు లేని కారణంగా కొందరు ప్రభుత్వ సంక్షేమ పధకాలు అందుకోలేక పోతున్నారన్నారు. గిరిజనుల కోసం ప్రత్యేక ఆధార్ డ్రైవ్ చేపట్టాలని కోరారు. గిరిపుత్రుల దీన స్థితి చూసి ఇందుకూరుపేట మండలంలో తన చొరవతో 500 కు పైగా ఆధార్ కార్డులు చేయించిన విషయాన్ని వివరించారు. సచివాలయ స్థాయిలో ఓ నోడల్ ఆఫీసర్ ను ప్రభుత్వ పథకాలపై గిరిజనులకు అవగాహన కల్పించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సామాజికంగా వెనుకబడ్డ గిరిజనుల కోసం యువగళం పాదయాత్ర సందర్భంగా యానాది కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానన్న మంత్రి లోకేష్ హామీ అమలు చేసి యానాదులను ఆదుకోవాలని అభ్యర్ధించారు. పొట్ట కూటి కోసం వలసబాట పడుతూ సంచార జీవితం గడిపే యానాదులకు ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ద్వారా చేపల వేటకు వలలు, సైకిళ్ళు , ఆటోలు అందించాలని మనవి చేశారు. గత ఐదేళ్లలో మాటలు తప్ప దళితులకు ఆర్ధిక లబ్ది చేకూర్చే ఏ పధకం అమలుకు నోచుకోలేదనన్నారు. దళిత బిడ్డల స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ల ద్వారా శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు చూపించాలన్నారు. కోవూరు నియోజకవర్గంలో 120 కి పైగా వున్న దళిత కాలనీలలో పాతికేళ్ల క్రితం ప్రభుత్వం కట్టించిన పక్కా గృహాలు శిధిలావస్థకు చేరాయని కొత్తగా పక్కా గృహాలు మంజూరు చేయాలనీ కోరారు. ఇళ్ళు లేక రోడ్ల పక్కన, కాలువల పక్కన గుడెసెలు వేసుకుని జీవనం సాగిస్తున్న దళిత, గిరిజనుల సంక్షేమం పట్ల ప్రభత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి విజ్ఞప్తి చేశారు.
What's Your Reaction?






