మేమంతా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వెంటే నడుస్తాం

వి.పి.ఆర్ గారికి కలిసిన లేగుంటపాడు, జమ్మిపాలెం, సీతారామపురం, మోడేగుంట గ్రామస్థులు
జనసాక్షి : మేమంతా వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి వెంటే నడుస్తామని లేగుంటపాడు, జమ్మిపాలెం, సీతారామపురం గ్రామానికి చెందిన పలువురు గ్రామస్థులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సోమవారం నెల్లూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి శాలువాలు, పుష్ఫగుచ్ఛాలతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా గ్రామాల్లో వేమిరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని గుర్తు చేశారు. అందుకు తామంతా వి.పి.ఆర్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో లేగుంటపాడు, జమ్మిపాలెం, సీతారామపురం గ్రామానికి చెందిన శరత్‌కుమార్‌రెడ్డి, శివారెడ్డి సుధాకర్‌రెడ్డి, నాగిరెడ్డి శశిధర్‌రెడ్డి, దాసరి మురళి, దాసరి విజయ్‌భరత్, దేశపాండే, యంకయ్య, చొప్పా మల్లికార్జున, వెంకటరమణయ్య, ఇతర గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






