మినుము పంట తర్వాత రైతులు నువ్వు పంటను సాగు చేసుకుంటే లాభదాయకం

వలేటివారిపాలెం జనసాక్షి : మినుము పంట తర్వాత నువ్వు పంట సాగు చేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని వలేటివారిపాలెం మండల ఈ వ్యవసాయ శాఖ అధికారి ఎం. హేమంత్ భరత్ తెలిపారు. మంగళవారం మండలంలోని చుండి, అయ్యవారిపల్లి గ్రామంలో పొలం పిలుస్తోంది కార్యక్రమం మండల వ్యవసాయ అధికారి ఎం హేమంత్ భరత్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. వ్యవసాయ శాఖ అధికారి హేమంత్ భరత్ మాట్లాడుతూ ప్రస్తుతం మినుము కోతలు జరుగుతున్న నేపథ్యంలోో రైతులు నువ్వు పంటను సాగు సాగు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం నువ్వులు మార్కెట్లో 13,000 నుండి 14,000 వరకు మంచి గిట్టుబాటు ధర ఉందని తెలిపారు. నువ్వుల రకాలు వై ఎల్ ఎం 146, వై ఎల్ ఎం 66 రకాలు విత్తనాలు చిన్న పావని రీసెర్చ్ స్టేషన్ లో అందుబాటులో ఉన్నాయని, విత్తనాలు కావలసిన రైతులు మీ గ్రామ పరిధిలోని గ్రామ వ్యవసాయ సహాయకులను సంప్రదించవలసినదిగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ ఉద్యానవన సహాయకులు పి.నాగరాజు, సిహెచ్ రవీంద్ర అయ్యవారిపల్లి గ్రామ సర్పంచ్ డేగ వెంకటేశ్వర్లు(బుజ్జి )ఉప సర్పంచ్ ఎం.కొండలరావు, పంచాయితీ సెక్రటరీ వెంకటేశ్వర్లు, వీఆర్ఓ నారాయణ రైతులు జి. ప్రసాద్,తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






