అమర జీవి పొట్టి శ్రీరాములకి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన నివాళి

అమరజీవికి ఘన నివాళి
తెలుగు భాష మాట్లాడేవారి కోసం త్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఆదివారం నెల్లూరు నగరంలోని ఆయన నివాసంలో శ్రీ పొట్టి శ్రీ రాములు చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆత్మార్పణ దినంగా నిర్వహించడం.. ఆయన సేవలను దక్కిన గౌరవమన్నారు. స్వతంత్ర భారతదేశ సాధనకై గాంధీ మహాత్ముడు చూపిన అహింసా మార్గంలో పయనించిన మహనీయులు పొట్టి శ్రీరాములని అన్నారు.
What's Your Reaction?






