తొక్కిసలాట బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

తొక్కిసలాట బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందడంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కోవూరు ఎమ్మెల్యే, టిటిడి బోర్డు మెంబర్ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి .. బాధితులకు బాసటగా నిలిచారు. గురువారం ఉదయం హుటాహుటిన తిరుపతికి వెళ్లిన ఆమె.. తిరుపతిలోని పద్మావతి హాస్పిటల్స్, స్విమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడి.. ధైర్యంగా ఉండాలని సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లతో చర్చించారు. బాధితుల యోగ క్షేమాలపై ఆరా తీశారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమై వైద్య సేవలు అందించాలని, ఎక్కడా ఇబ్బందులు లేకుండా చూడాలని వారికి సూచించారు.బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, ఎవరూ అధైర్య పడొద్దని స్పష్టం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 25 లక్షల పరిహారం ప్రకటించిన విషయంపై ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు.
What's Your Reaction?






