8.09 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తున్న సీఎం జగన్
జనసాక్షి :ఈ రోజు 8.09 లక్షల మంది పిల్లలకు మంచి చేస్తూ జులై, ఆగస్టు, సెప్టెంబర్‌కు సంబంధించిన అక్షరాల రూ.583 కోట్లు నేరుగా జమ చేస్తున్నాం. ఈ నాలుగున్నరేళ్ల పాలనను గమనిస్తే..కేవలం ఈ ఒక్క పథకానికే 27.61 లక్షల మంది పిల్లలకు వారి పూర్తి ఫీజులు తల్లిదండ్రుల తరఫున మంచి మేనమామగా అక్షరాల రూ.11,900 కోట్లు ఇచ్చామని గర్వంగా చెబుతున్నాను. మన ప్రభుత్వం రాకముందు గత ప్రభుత్వం ఫీజులు రూ.1700 కోట్లు బకాయి పెడితే. మీకోసం మన ప్రభుత్వమే చెల్లించింది. గత ప్రభుత్వ హయాంలో రూ.12 వేల కోట్లు కూడా సరిగ్గా ఖర్చు చేయలేదు. ఈ రోజు రూ.18576 కోట్లు ఖర్చు చేశాం. ఇది గత ప్రభుత్వం చేసిన వ్యయం కంటే 6,435 కోట్లు అధికం తేడా గమనించండి- సీఎం జగన్.
What's Your Reaction?






