మహనీయుల చరిత్రలను విద్యార్థులు తెలుసుకోవాలి
స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది వీరులు తమ ప్రాణాలు అర్పించారని, అలాంటి వ్యక్తులలో అల్లూరి సీతారామరాజు ముఖ్యుడని కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అన్నారు. కందుకూరుకు చెందిన ప్రముఖ చరిత్రకారుడు షేక్ నశీర్ అహ్మద్ రచించిన పజూలుల్లా ఖాన్, షేక్ మదీనా జీవిత విశేషాలు పుస్తకాన్ని ముస్లిం డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కందుకూరు టీఆర్ఆర్ జూనియర్ కళాశాల ప్రాంగణంలో ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుమాట్లాడుతూ టిష్ వారికి సవాల్ విసురుతూ, వారికి వ్యతిరేకంగా ప్రజలను ఏకం చేసి పోరాటాలు చేశారన్నారు. సీతారామరాజుకు ఫజులుల్లా ఖాన్, షేక్ మదీనాలు అండదండలు అందించిన విధానాన్ని పుస్తక రచయిత చక్కగా వివరించారని ప్రశంసించారు. చరిత్రలో మరుగునపడిన అంశాలన్నీ ఇలాంటి రచయితల వల్లే ప్రజలు తెలుసుకోగలుగుతున్నారని అన్నారు. విద్యార్థులందరూ ఇలాంటి మహనీయుల జీవిత చరిత్రలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే నాగేశ్వరరావు తెలిపారు. ప్రతిరోజు పుస్తకాలను చదవటానికి కొంత సమయం కేటాయించాలని, గురువులు కూడా అందుకు చొరవ తీసుకోవాలని కోరారు. పుస్తకాలు చదవడం వల్ల పరిజ్ఞానం పెరగటంతో పాటు భాష పై పట్టు పెరుగుతుందన్నారు. జీవితాలు సక్రమ మార్గంలో నడవడానికి పుస్తకాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపాల్ షేక్ నాగూర్ వలి, ముఖ్య వ్యాఖ్యాత కట్టా సుబ్బారావు మరియు అధ్యాపక అధ్యాపకేతర ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
What's Your Reaction?