నవోదయలో రీజనల్ బాక్సింగ్ పోటీలు ప్రారంభం

Jul 22, 2026 - 17:52
 0  9

ఒంగోలు శిఖర జనసాక్షి  : ఒంగోలులోని జవహర్ నవోదయ విద్యాలయంలో రీజినల్ స్థాయి బాక్సింగ్ పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ద్రోణాచార్య అవార్డు గ్రహీత ఐ.వెంకటరావు ముఖ్య అతిథిగా వచ్చి బాక్సింగ్ పోటీలను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి రోజు విద్యార్థుల శారీరక, మానసిక వికాసానికి, భావోద్వేగాలను అదుపులో ఉంచుకొనేందుకు క్రీడలు దోహదం చేస్తాయని, అలాగే ప్రతి క్రీడా కారుడు క్రమ శిక్షణ, ప్రణాళిక తో ఆటలు ఆడాలి అప్పుడే క్రీడలలో పేరుతో పాటు విలువలు కలిగిన మంచి విజేతలు కాగలరని పేర్కొన్నారు.విద్యా లయం ఇన్ చార్జి ప్రిన్సిపల్ ఎ. రఘు మాట్లాడుతూ పిల్లలు చదువుతో పాటు ఆటపాటల్లో పాల్గొనడం ముఖ్యమని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాలుగా ఈ ప్రాంగణంలో విజయవంతంగా బాక్సింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ రీజినల్ బాక్సింగ్ పోటీలను నిర్వహించెందుకు అవకాశం ఈ విద్యాలయంకు ఇచ్చినందుకు నవోదయ విద్యాలయం హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ బి. చక్రపాణి , క్లస్టర్ అసిస్టెంట్ కమీషనర్ హేమలత వారికి ఇన్చార్జి ప్రిన్సిపాల్ ఎ.రఘు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మూడు రోజుల పాటు జరిగే పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి పరిధిలోని విద్యాలయాల నుండి అండర్ -14, అండర్ -17, అండర్ 19 విభాగాలలో బాల,బాలికలందరు బాక్సింగ్ పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యాలయం సీనియర్ టీచర్ తాతయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు ఆర్.కిషోర్ కుమార్ మరియు విద్యాలయ సిబ్బంది అందరు, వివిధ విద్యాలయాల ఎస్కార్ట్ టీచరులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow