20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గుడ్లూరు విఆర్వో
20 వేలు లంచం తీసుకుంటు ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
గుడ్లూరు జనసాక్షి : 20వేలు లంచం తీసుకుంటూ విఆర్ఓ చలమారెడ్డి ఏసీబి కి పట్టుబడిన సంఘటన మండల కేంద్రమైన గుడ్లూరు లో శనివారం జరిగింది. వివరాలు ప్రకారం గుడ్లూరు కు చెందిన మాధవరెడ్డి ప్రాపర్టీ సర్టిఫికెట్ కోసం రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగా 20 వేల రూపాయలు లంచం ఇస్తే సర్టిఫికెట్ ఇస్తామని గుడ్లూరు విఆర్ఓ చలమారెడ్డి డిమాండ్ చేయడంతో లంచం వీయడానికి ఇష్టపడని మాధవరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ అధికారులు పక్క ప్రణాళతో విఆర్ఓ ను పట్టుకోవడానికి పథకం రచించారు. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మాధవ రెడ్డి 20,000 ఇస్తాను కార్యాలయంకు వద్దకు రావాలని చలమారెడ్డికి ఫోన్ చేశాడు. దీంతో చలమారెడ్డి ఆ నగదును కవర్ లో పెట్టి కార్యాలయంలో టేబుల్ కింద పెట్టాలని సూచించాడు. మాధవరెడ్డి అలాగే చేసాడు. బస్టాండ్ సెంటర్లో ఉన్న చలమారెడ్డి కార్యాలయంకు వెళ్లి ఆ నగదు తీసుకుంటుండగా అక్కడ కాపు కాసి ఉన్న ఏసీబీ అధికారులు దాడి చేసి చలమారెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నగదును స్వాధీనం చేసుకున్నారు.
What's Your Reaction?