చీమకుర్తి దొంగతనం కేసును ఛేదించిన ప్రకాశం జిల్లా పోలీసులు
ప్రకాశం జిల్లా: జనసాక్షి :చీమకుర్తి టౌన్‌లోని శ్రీ వెంకటేశ్వర హార్డ్‌వేర్ షాప్‌లో జరిగిన దొంగతనం కేసులో ఇద్దరు ముద్దాయిలను అరెస్ట్ చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ముద్దాయిల వద్ద నుండిరూ.37 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. స్వాదీనం చేసుకున్న నగదు:రూ.5,95000 కాగా మొత్తం 34 సవరలు బంగారం, సుమారు 2 కేజీ ల వెండి నగదు రూ.5,95,000 మొత్తం విలువ సుమారు రూ.37,00,000 ఉంటుందని తెలియజేశారు. శనివారం ఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి దొంగతనం కేసుకు సంబంధించిన వివరాలను ఎస్పీ వెల్లడించారు. ఫిర్యాది వివరములు-: చీమకుర్తి పట్టణంలోని కొత్తపేటలో సురేష్ బాబు నివాసం ఉంటున్నారు. సుమారు 1½ సంవత్సరం క్రితం చీమకుర్తి టౌన్ మెయిన్ రోడ్డులోని ఇసుకవాగు సెంటర్ వద్ద శ్రీ వెంకటేశ్వర హార్డ్‌వేర్ షాప్ ఏర్పాటు చేసుకుని వ్యాపారం చేస్తూ జీవిస్తున్నాడు. ది.12.05.2026న ఉదయం సుమారు 8 గంటలకు షాప్ వద్దకు వెళ్లి చూడగా, రెండవ గదికి ముందు ఉన్న చెక్క తలుపుకు బిగించి ఉన్న తాళం వేసే ఇనుప గడియను లేపి ఉన్నట్లు గమనించాడు. దీంతో అనుమానం వచ్చి రెండవ గదిలోకి వెళ్లి చూడగా, రెండు అలమారాల్లో ఉన్న బంగారం, వెండి, నగదును గుర్తు తెలియని దొంగలు దొంగిలించి వెళ్లిపోయినట్లు గుర్తించి, ఫిర్యాది చీమకుర్తి పోలీస్ స్టేషన్‌లో సురేష్ బాబు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసినట్లు ఎస్పి వెల్లడించారు.కేసు చేధించిన తీరు: నేరస్థలంలో ఒంగోలు క్లూస్ టీం వారు సేకరించిన సాంకేతిక ఆధారాల మేరకు పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి, నేరస్థలం, పరిసర ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక పరిజ్ఞానం ఇతర ఆధారాలను ఉపయోగించి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయగా. నేరస్థలంలో సేకరించిన ఆధారాలు ఆధారంగా నెల్లూరు జిల్లా, సీతారామపురం గ్రామానికి చెందిన మిరపల్లి ప్రసాద్ గుర్తించారు. ముద్దాయి ప్రసాద్ నెల్లూరు జిల్లాలోని సీతారామపురం, ప్రకాశం జిల్లాలోని టంగుటూరు, కందుకూరు టౌన్, పొదిలి, కనిగిరి మరియు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నమోదైన 13 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. కావున ముద్దాయి కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టి, ముద్దాయిల సమాచారం సేకరించారు. తేది.22.05.2026న కనిగిరి మండలంలోని నందనమారెళ్ల గ్రామ శివాలయం వద్ద పామూరు వైపు నుంచి స్కూటీపై వస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న బంగారు, వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పామూరులోని PDCC బ్యాంకు, దుత్తలూరులోని SBI బ్యాంకుల్లో ముద్దాయి ప్రసాద్ డిపాజిట్ చేసిన రూ.6,00,000 నగదులో రూ.5,000 ఖర్చు చేయగా, మిగిలిన రూ.5,95,000/-లను ప్రసాద్‌తో విత్‌డ్రా చేయించి, మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు.
ప్రకాశం జిల్లా ఎస్పీ వి.హర్షవర్ధన్ రాజు స్వీయ పర్యవేక్షణలో, ఒంగోలు డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 1) చీమకుర్తి సీఐ D. ప్రసాద్, 2) చీమకుర్తి ఎస్సై L.సంపత్ కుమార్, 3) మద్దిపాడు ఎస్సై G.వెంకట సూర్య, 4) కొత్తపట్నం ఎస్సై U.సుధాకర్, 5) ఒంగోలు తాలూకా ఎస్సై సుదర్శన్, 6)సంతనూతలపాడు ఎస్సై అజయ బాబు మరియు వారి సిబ్బంది బృందాలుగా ఏర్పడి, కేసును చేధించటం జరిగింది.
ఈ కేసును ఛేదించడంలో కీలక పాత్ర పోషించిన ఒంగోలు డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు,చీమకుర్తి సీఐ డి. ప్రసాద్, ఫింగర్ ప్రింట్ బ్యూరో ఇన్‌స్పెక్టర్ ఎస్. రవీంద్రరెడ్డి, సబ్ డివిజన్ ఎస్సైలు ఎల్. సంపత్‌కుమార్, జి. వెంకట సూర్య, వి. అజయ్‌బాబు, వి. సుధాకర్, ఎం. సుదర్శన్, చీమకుర్తి పోలీస్ స్టేషన్ సిబ్బంది వి. శ్రీనివాసులు, ఏఎస్‌ఐ.1776, బి. రంగయ్య, హెచ్‌సీ.1003, ఎన్.వి. రాము, పీసీ.1308, కె. అనిల్, పీసీ.2644, ఎ.వి. నాయుడు, పీసీ.2491, ఒంగోలు వన్‌టౌన్ జి. విజయ్, పీసీ.563, ఎం. అనిల్, పీసీ/2662, కొత్తపట్నం పియస్ ఎస్‌కే. మౌలాలి, పీసీ. 2640, మద్దిపాడు పియస్ జె. రమేష్, పీసీ.3525 లను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి క్యాష్ రివార్డ్ అందచేశారు.
What's Your Reaction?