మాజీ సీఎం జగన్ తో పొగాకు రైతులు సమావేశం
జగన్‌తో పొగాకు రైతుల సమావేశంలో పాల్గొన్న కాకాణి
తాడేపల్లి శిఖర జనసాక్షి
మాజీ ముఖ్యమంత్రి, వర్యులు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తో పొగాకు రైతులు సమావేశమై పలు విషయాలు చర్చించడం జరిగింది, పొగాకు రైతుల సమావేశంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు కూడా పాల్గొన్నారు
వివిధ జిల్లాల పొగాకు రైతులతో వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్ భేటీ
పొగాకు ధరల సంక్షోభం, కొనుగోళ్లలో తీవ్ర జాప్యంపై రైతులతో చర్చించిన వైయస్.జగన్
1. వేలం ప్రారంభమై 94 రోజులు గడిచినా పొగాకు కొనుగోళ్లు పూర్తికాలేదని రైతుల ఆవేదన
2. సాధారణంగా జులై నాటికి ముగియాల్సిన అమ్మకాలు ఇప్పటికీ కొనసాగడం ప్రమాదకరమన్న రైతులు
3. ఏపీలో సరుకు అమ్ముడవకముందే మైసూరులో వేలం ప్రారంభమైతే వ్యాపారులు అక్కడికి వెళ్లిపోతారని ఆందోళన
4. కొన్ని వేలం కేంద్రాల్లో 30 నుంచి 40 శాతం వరకు నో బిడ్స్, రిజెక్షన్లు నమోదవుతున్నాయని రైతుల వెల్లడి
5. తిరస్కరించిన ఒక్కో బేలును మళ్లీ వేలానికి తీసుకురావడానికి కనీసం రూ.1,000 అదనపు భారం పడుతోందన్న రైతులు
6. ఒక్కో బ్యారన్‌పై రైతుకు రూ.5 లక్షల వరకు నష్టం వచ్చే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన
7. పొగాకు రైతులకు ఆత్మహత్యలే శరణ్యమన్న దుస్థితి వచ్చిందని రైతుల వ్యాఖ్య
8. పోలవరంలో పొగాకు రైతు ఆత్మహత్య చేసుకున్నారని సమావేశంలో వెల్లడించిన రైతులు
9. 80–85 మిలియన్ కిలోల పంటలో కేవలం 7 మిలియన్ కిలోలే కొనుగోలు చేశారని ఏలూరు, గోదావరి రైతుల వెల్లడి
10. పంట వేసే సమయంలో ఎక్కువగా సాగుచేయాలని ప్రోత్సహించిన కంపెనీలు వేలం సమయానికి సిండికేట్‌గా మారాయని ఆరోపణ
11. పొగాకు బోర్డు రైతులను వదిలేసి వ్యాపార వర్గాలకు కొమ్ముకాస్తోందని రైతుల మండిపాటు
12. రూ.200కు తగ్గకుండా కొనాలని చంద్రబాబు చెప్పినా వ్యాపారులు పట్టించుకోలేదని రైతుల విమర్శ
13. రైతుల ఆందోళనలను పోలీసులతో అణచివేస్తూ కేసులు పెడుతున్నారని కందుకూరు రైతుల ఆరోపణ
14. జగన్ ప్రభుత్వంలో మార్క్‌ఫెడ్ జోక్యంతో కొనుగోళ్లలో పోటీ ఏర్పడి రైతులకు మంచి ధరలు వచ్చాయని రైతుల గుర్తుచేసింపు
15. ఇప్పుడు ఉన్న పొగాకునే కొనకుండా వచ్చే ఏడాదికి ఇండెంట్ ఇవ్వడం ఏమిటని రైతుల ప్రశ్న
16. జగన్ కదిలితేనే ప్రభుత్వం కదులుతుందని, రైతుల తరఫున ఆయన పోరాటమే తమకు శరణ్యమని రైతుల స్పష్టీకరణ
What's Your Reaction?