బీపీసీఎల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం

బీపీసీఎల్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
నెల్లూరు జిల్లా రామాయపట్నం సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బిపిసిఎల్) రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ కంపెనీ ఏర్పాటులో మరో కీలక ముందడుగు పడింది. ఇప్పటికే రామాయపట్నం కేంద్రంగా కంపెనీ ఏర్పాటు చేసేందుకు బీపీసీఎల్ యాజమాన్యం అంగీకరించగా.. గురువారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ దీనిపై సుధీర్ఘంగా చర్చించింది. నెల్లూరు జిల్లా రామయ్యపట్నంలో 6 వేల ఎకరాల్లో 96 వేల కోట్లతో బీపీసీఎల్ భారీ రిఫైనరీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
రామాయపట్నం పోర్టు సమీపంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు హర్షం వ్యక్తం చేశారు. బీపీసీఎల్ ఏర్పాటు కానుండటం జిల్లా ప్రజలకు ఎంతో గర్వకారణమని, పారిశ్రామికంగా జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. తాను ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్న నెల్లూరు జిల్లాలో, తన హయాంలో ఇంత భారీ పరిశ్రమ ఏర్పాటు కావడం చాలా గర్వకారణంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా ష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి ఎంపీ గారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
-ఎంపీ వేమిరెడ్డి ప్రత్యేక చొరవ..
బీపీసీఎల్ కంపెనీ జిల్లాలోని రామాయపట్నంలో ఏర్పాటు అయ్యేందుకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు ప్రత్యేక చొరవ చూపారు. ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిశారు. అలాగే రామాయపట్నం వద్ద కంపెనీ ఏర్పాటుకు ఉన్న అనుకూలతలను వివరించడంలో సక్సెస్ అయ్యారు. సీఎం చంద్రబాబు గారిని కలిశారు. అలాగే బీపీసీఎల్ ప్రతినిధులతో ఢిల్లీలో చర్చించారు. ఇటు సీఎం చంద్రబాబు గారి ఆశీసులు, అటు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారి చొరవతో నెల్లూరు జిల్లాకు బీపీసీఎల్ ప్లాంట్‌ను వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు సాధించారు. జిల్లా అభివృద్ధికి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి గారు నిరంతరం కృషి చేస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన ఎంపీ వేమిరెడ్డి గారు.. జిల్లాకు కావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న పలు అంశాలకు ఆయన పరిష్కారం చూపారు. జిల్లా వైద్య కళాశాలలో పీజీ సీట్లు సాధించడం మొదలు... ఈఎస్‌ఐసీ హాస్పిటల్‌కు స్థల పరిశీలన, బిట్రగుంట రైల్వే, పాటూరు చేనేత క్లస్టర్‌కు నిధుల మంజూరు చేయించం, మిథాని పై కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలవడం వంటి వివిధ కార్యక్రమాలతో ఆయన.. జిల్లా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. వివిధ వివిధ ప్రాజెక్టులు జిల్లాకు తెచ్చేందుకు నిరంతరం పని చేస్తున్నారు. ప్రజాసేవే పరమార్థంగా రాజకీయాల్లో కొత్త ఒరవడి తెస్తున్నారు.
ప్రస్తుతం రామాయపట్నం కేంద్రంగా 96 వేల కోట్లతో బీపీసీఎల్ ఏర్పాటుతో పారిశ్రామికంగా, ఉద్యోగ ఉపాధి అవకాశాల పరంగా సమూల మార్పులు రానున్నాయి. బీపీసీఎల్‌తో దాదాపు 15 అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు కానుండటంతో ప్రత్యక్ష్యంగా పరోక్షంగా వేలాది మందికి ఉపాధి లభించనుంది. పరిశ్రమ నిర్మాణ సమయంలోనే దాదాపు 1 లక్ష మందికి ఉపాధి లభించనుండటం సాధారణ విషయం కాదు. జిల్లా సమగ్రాభివృద్ధిలో బీపీసీఎల్ ప్లాంట్ ఒక మైలు రాయిగా నిలిచిపోనుందని ఎంపీ వేమిరెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
What's Your Reaction?






