ఆహ్లాదం కోసం క్రీడల దోహదపడతాయి

ఆహ్లాదకరం కోసం క్రీడలు ద్రోహదం - అంధుల ఆటల పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
ఒంగోలు, జనసాక్షి:
ఆహ్లాదం మానసిక ఉల్లాసం కోసం క్రీడలు చక్కగా దోహద పడతాయని జిల్లా కలెక్టర్ ఎ తమీమ్ అన్సారియా అన్నారు. లూయి బ్రెయిలీ జయంతి సందర్భంగా ప్రకాశం, బాపట్ల జిల్లా లోని అంధులకు స్థానిక డీఆర్ఎం పాఠశాలలో విభిన్న ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా ముఖ్య అతిథిగా పాల్గొని ఆటల పోటీలను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ చిరంజీవి, మోప్మా పీడి టి రవి కుమార్, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ అర్జున్ నాయక్, బీసీ సంక్షే మాధికారి అంజలా, జిల్లా గ్రంధాలయ సంస్థ సెక్రటరీ ఆదిలక్ష్మి, మైనార్టీ కార్పోరేషన్ ఈడీ ధన లక్ష్మి, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజేశ్వరి, పాఠశాల గేమ్స్ సెక్రటరీ మహామ్మద్ హీజీర బేగంలు అతిథులుగా పాల్గొన్నారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల జెడీ, నిర్వాహణాధికారి జి అర్చన,, పలు పాఠశాలల పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






