పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

Jan 19, 2026 - 11:41
Jan 19, 2026 - 11:45
 0  98
పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి

పశు వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని వలేటివారిపాలెం ప్రాంతీయ  పశు వైద్యశాల అసిస్టెంట్  డైరెక్టర్ డాక్టర్ ఎంతోటి చెన్నకేశవులు తెలిపారు. సోమవారం  టిడిపి మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం  తో కలసి ఉచిత పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. డాక్టర్ చెన్నకేశవులు మాట్లాడుతూ    ఈ నెల 31వరకు వలేటివారిపాలెం పశువైద్యశాల పరిధిలో గల లింగశముద్రం, వలేటివారిపాలెం మండలాల్లో ఉచిత పశువైద్య శిబిరాలు జరుతాయని పశుపోషకులు, గొర్రెల పెంపకం దారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు  మాదాల లక్ష్మి నరసింహం  మాట్లాడుతు ప్రతీ గ్రామంలో జరిగే ఈ శిబిరాల్లో పశువులకు ఇన్సూరెన్స్ చేస్తారని, రైతులు ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేశారు. గ్రామ సర్పంచ్ సాదు శ్రీలత మాట్లాడుతు గోకులం షెడ్స్ కావలసినవారు నమోదు చేసుకోవాలని కోరారు . నాయకులు వలేటి మధు మాట్లాడుతు పశుగ్రాసలు పెంచుకుంటే ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని తెలిపారు.మాజీ సొసైటీ ప్రెసిడెంట్ వలేటి నరసింహ మాట్లాడుతు దూడలకు, గొర్రెలకు నట్టల నివారణ మందులు సకాలంలో తాపించాలని కోరారు. అనంతరం గొర్రెలకు, దూడలకు డెవర్మింగ్ మందులు ఇచ్చారు. కార్యక్రమంలో లైవ్స్టాక్ అసిస్టెంట్ శ్రీలత, పశు సహాయకులు లీలమనోహర్, తిరున్, రమేష్,కిరణ్, శ్రావణీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow