ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబుకు ప్రత్యేక అవార్డు

Jan 20, 2026 - 20:05
Jan 20, 2026 - 20:20
 0  150
ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజా బాబుకు  ప్రత్యేక అవార్డు

- ప్రకాశం కలెక్టర్ కు ప్రత్యేక అవార్డు

- ఓటర్ల జాబితా మ్యాపింగులో పనితీరుకు గుర్తింపు

 ఒంగోలు  జనసాక్షి :ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ సమ్మరీ ( ఎస్.ఐ.ఆర్ )-2026లో ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబుకు ప్రత్యేక అవార్డు దక్కింది. ఓటర్ల మ్యాపింగ్ లో సాధించిన పురోగతికిగాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్స్ -2025కు ఎంపిక చేసినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం తెలిపింది. 2002 ఎస్.ఐ.ఆర్. డేటాతో 2026 ఎస్.ఐ.ఆర్. డేటాను సరిపోల్చటంలో కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ నేపథ్యంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈనెల 25వ తేదీన విజయవాడలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి అవార్డు రావడంతో జిల్లా కలెక్టర్ కు డిఆర్ఓ ఓబులేసు, పలువురు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు శుభాకాంక్షలు తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow