నేటినుండి రెవెన్యూ సదస్సులు

గుడ్లూరు జనసాక్షి.
ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి భూ సమస్యలను పరిష్కరించాలని లక్ష్యంతో మీ భూమి- మీ హక్కు పేరుతో మండలంలోని 18 రెవెన్యూ గ్రామాలలో శుక్రవారం నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తహసిల్దార్ జి.స్వర్ణ గురువారం తెలిపారు. రెవెన్యూ సదస్సులో షెడ్యూల్ వివరాలను తాహ సిల్దార్ వివరించారు. ఈ రెవెన్యూ సదస్సులు నిర్ణయించిన తేదీలలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతాయన్నారు. 6 తేదీన నాయుడుపాలెం,7వ తేదీన చినలాటరపీ, 10వ తేదీన పొట్లూరు, 11వ తేదీన మోచర్ల, 12వ తేదీన రావూరు, 13వ తేదీన చేవూరు, 18వ తేదీన స్వర్ణజపురం, 19వ తేదీన గుడ్లూరు, 20వ తేదీన పర కొండపాడు , 21వ తేదీన పర కొండ పాడు అగ్రహారం, 26వ తేదీన దప్పలంపాడు,27వ తేదీన బసిరెడ్డిపాలెం, 28వ తేదీన పూరేటిపల్లి, జనవరి 2వ తేదీన అమ్మవారిపాలెం, 3 వ తేదీన కొత్తపేట, 4 వ తేదీన గుం డ్ల పాలెం, 7వ తేదీన వెం కంపేట, 8వ తేదీన దా రకానిపాడు గ్రామాలలో సచివాలయాల్లో, ప్రాథమిక పాఠశాలల్లో ఈ రెవెన్యూ సదస్సులో జరుగుతాయని తహసిల్దార్ తెలిపారు. ప్రజలు తమ భూ సమస్యలను అర్జీల ద్వారాఅధికారులకు అందజేయాలన్నారు.ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
What's Your Reaction?






