అంకమ్మ తల్లి దేవాలయం పున:నిర్మాణానికి విరాళం

కందుకూరు జనసాక్షి : కందుకూరు పట్టణ గ్రామ దేవత శ్రీ అంకమ్మ తల్లి దేవాలయం పున: నిర్మాణంలో భాగంగా కందుకూరు వాస్తవ్యులు పరిమి తిరుపతమ్మ వారి కుమారులు నాగేంద్రబాబు, రఘురాం
రూ 31,116 నగదును ఆలయ ప్రాంగణంలో పునర్నిర్మాణ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎమ్మెల్యే శ్రీ మానుగుంట మహీధర్ రెడ్డి పిలుపుమేరకు ఇప్పటివరకు అంకమ్మ తల్లి దేవాలయం పునర్నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ఎనిమిరెడ్డి వెంకటరెడ్డి,ఆవుల మాధవరావు, మాదాల మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






