జడ్పీటీసీ భర్త ఇంటూరి హరిబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు
మాజీ జడ్పీటీసీ భర్త ఇంటూరి హరిబాబును అదుపులోకి పోలీసులు
వలేటివారిపాలెం: వలేటివారిపాలెం మండలానికి చెందిన మాజీ జడ్పీటీసీ భర్త ఇంటూరి హరిబాబును పోలీసులు సోమవారం ఉదయం ఆయన ఇంటి వద్దకు వెళ్లి అదుపులోకి తీసుకొని గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.వివరాల్లోకి వెళితే.. బడేవారిపాలెం గ్రామం నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా ఉన్నం సుధాకర్‌రావు నామినేషన్ దాఖలు చేశారు. అయితే, నామినేషన్ ఉపసంహరించుకోవాలంటూ అధికార పార్టీకి చెందిన నాయకులు బెదిరించారు. ఈ పరిణామాల నేపథ్యంలో సుధాకర్‌రావు గత రెండు రోజులుగా కనిపించడం లేద సమాచారం.ఈ క్రమంలో వైసీపీ నాయకుడు ఇంటూరి హరిబాబును పోలీసులు ఆయన నివాసం వద్ద అదుపులోకి తీసుకొని గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు, సుధాకర్‌రావు గానీ, ఆయన బంధువులు గానీ పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలిసింది. ఎలాంటి ఫిర్యాదు అందకుండానే హరిబాబును అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు ఏమిటని వైసిపి శ్రేణులు ప్రశ్నిస్తున్నారు. సుధాకర్‌రావు ఆచూకీకి, చెప్పాలని హరిబాబు ను పోలీసులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా ఇలాంటి ఘటనలు జరగడం వల్ల ప్రజల్లో భయాందోళనతో ఉద్రుక్తత నెలకొంది.
What's Your Reaction?