సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం

Nov 2, 2026 - 11:11
 0  298

సింగరాయకొండ జాతీయ రహదారిపై ఘోర అగ్నిప్రమాదం

 మంటల్లో పూర్తిగా దగ్ధమైన కార్గో వాహనం.. డ్రైవర్ సమయస్ఫూర్తితో తప్పిన ప్రాణాపాయం

సింగరాయకొండ, శిఖర జనసాక్షి: సింగరాయకొండ జాతీయ రహదారిపై కుంభకోణం కేఫ్ సమీపంలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. విజయవాడ నుంచి చెన్నై వైపు స్వీట్ల లోడుతో వెళ్తున్న ఆర్‌ఎస్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ కార్గోకు చెందిన టాటా బడా దోస్త్ వాహనం (AP 39 WR 9072 AC)లో అకస్మాత్తుగా పొగలు రావడంతో ఈ ప్రమాదం సంభవించింది.వాహనంలో పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ ప్రవీణ్ వెంటనే అప్రమత్తమై వాహనాన్ని రహదారి పక్కకు నిలిపివేశాడు. అయితే క్షణాల్లోనే మంటలు తీవ్రంగా వ్యాపించడంతో వాహనం పూర్తిగా దగ్ధమైంది. డ్రైవర్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.సమాచారం అందుకున్న హైవే మొబైల్ సిబ్బంది, సింగరాయకొండ పోలీసులు, టంగుటూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. స్థానికులు, పోలీసులు సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టి వాహనంలోని సుమారు 70 శాతం లగేజీని సురక్షితంగా బయటకు దించారు.ప్రమాద స్థలాన్ని సీఐ, ఎస్సై లు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో వాహనం పూర్తిగా కాలిపోయినప్పటికీ, రహదారిపై ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow