గుడ్లూరు పోలీస్ స్టేషన్ నుంచి హరిబాబును మరో ప్రాంతానికి తరలించిన పోలీసులు
గుడ్లూరు పోలీస్ స్టేషన్ నుంచి గుట్టుచప్పుడు కాకుండా హరిబాబును తరలింపు!
హరిబాబు ఆచూకీపై ఉత్కంఠ.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
వలేటివారిపాలెం: వైసీపీ నాయకుడు, మాజీ జడ్పీటీసీ భర్త ఇంటూరి హరిబాబును గుడ్లూరు పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు గుట్టుచప్పుడు కాకుండా మరో ప్రాంతానికి తరలించినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో హరిబాబు కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.సోమవారం ఉదయం బడేవారిపాలెం ఆయన నివాసం వద్ద పోలీసులు హరిబాబును అదుపులోకి తీసుకుని గుడ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.అనంతరం అక్కడి నుంచి ఆయనను మరో ప్రాంతానికి తరలించడంతో ప్రస్తుతం హరిబాబు ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.బడేవారిపాలెం ఎంపీటీసీ అభ్యర్థి ఉన్నం సుధాకర్‌రావు నామినేషన్ దాఖలు చేసిన నేపథ్యంలో అతనిని ఉపసంహరించుకోవాలని టిడిపి నాయకులు బెదిరించడం,గత రెండు రోజులుగా సుధాకర్‌రావు కనిపించడం లేదు.
What's Your Reaction?