డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి,- హరి బాబు

Aug 7, 2026 - 14:35
 0  56
డీఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణ జరిపించాలి,- హరి బాబు

డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి:         టంగుటూరులో హరిబాబు ఆధ్వర్యంలో వైసీపీ రిలే దీక్షలు

టంగుటూరు శిఖర జనసాక్షి: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వైసీపీ మండల కన్వీనర్ చింతపల్లి హరిబాబు ఆధ్వర్యంలో శుక్రవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి.కొండపి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ సూచనల మేరకు మండల కేంద్రంలోని టంగుటూరు తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న రావూరి కాంప్లెక్స్ వద్ద ఈ దీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలకు హరిబాబు పూలదండలు వేసి దీక్షలను ప్రారంభించారు.అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా హరిబాబు మాట్లాడుతూ డీఎస్సీ నియామక ప్రక్రియలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేలా పారదర్శక దర్యాప్తు నిర్వహించి, అక్రమాలకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని దీక్షలకు సంఘీభావం తెలిపారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow