పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేసిన జాలి రెడ్డి

Oct 28, 2025 - 15:35
 0  143
పునరావాస కేంద్రాల్లో తలదాచుకున్న  పేదలకు ఆహార పదార్థాలు పంపిణీ చేసిన జాలి రెడ్డి

తుఫాను ప్రభావిత పునరావాస ప్రాంతాలు, కేంద్రాలను సందర్శించిన కేసవరపు జాలి రెడ్డి

ఉలవపాడు మండలం  తుఫాను ప్రభావిత ప్రాంతాలను, పునరావాస కేంద్రాలను  వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కేశవరపు జాలి రెడ్డి సందర్శించారు. మన్నేటికోట తిరుపతమ్మ గుంట ఎస్సీ కాలనీవాసులను ఉంచిన పునరావాస కేంద్రాన్ని, కరేడు తుఫాను ప్రభావిత ప్రాంతవాసులను ఉంచిన బాలకోటయ్య సంఘం పునరావాస కేంద్రంలో ఉన్న వారిని పలకరించి, ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. వారికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉండి సహాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని జాల్ రెడ్డి తెలిపారు . ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచచ్ కొక్కిలగడ్డ కృష్ణారావు, పీతాా రామకృష్ణ, నల్లపరెడ్డి సుధాకర్ రెడ్డి, రామాల కృష్ణారెడ్డి, కలికి శివారెడ్డి , మహిదర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow