తాడేపల్లిగూడెంలో జరిగే ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు విజయవంతం చేయాలి.

డిసెంబర్ 16 17 తేదీలలో శ్రీశ్రీ కళావేదిక ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు . దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ.......... అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ శ్రీ శ్రీ కళావేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 16 17 తేదీలలో తాడేపల్లిగూడెంలో జరిగే ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలను విజయవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెంలో శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాల బ్రోచర్ ను మంత్రి ఆవిష్కరణ చేశారు. ప్రపంచ సాహిత్య చరిత్రలో 24 గంటలపాటు నాన్ స్టాప్ గా ఈ కార్యక్రమాలు జరగనున్నాయని తెలిపారు. ప్రపంచ తెలుగు కవితోత్సవము పుస్తక ఆవిష్కరణలు సాహిత్య సదస్సు మరియు సకళ కళాప్రదర్శనలు జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమానికి తాడేపల్లిగూడెం వేదిక కావడం తెలుగు భాష సంస్కృతి పరిరక్షణలో భాగంగా శ్రీ శ్రీ కళావేదిక ఈ కార్యక్రమాల నిర్వహించడం అభినందనీయమని మంత్రి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా నిరంతరం సాహిత్య కార్యక్రమాలు చేస్తున్న శ్రీ శ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ కత్తిమండ ప్రతాప్ ను మంత్రి అభినందించారు.
శ్రీ శ్రీ కళావేదిక జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో 5000 మంది కవులు కళాకారులు పాల్గొనున్నట్లు తెలిపారు. ఎటువంటి రుసుము లేదన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో శ్రీశ్రీ కళావేదిక ఒక సాహిత్య ప్రభంజనం సృష్టిస్తుందని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. 15 వేల మంది సభ్యులు కలిగి ఉన్న ఏకైక సంస్థగా శ్రీ శ్రీ కళావేదిక ఉండటం అభినందనీయమన్నారు. శ్రీ శ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యాన్ని తెలుగు భాషను తెలుగు కళలను ఖండాoతరాలు వ్యాపింప చేయాలని ఉద్దేశంతోనే ఈ ప్రపంచ తెలుగు సాహిత్య కళా ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఎప్పటి వరకు 125 కవి సమ్మేళనాలు నిర్వహించామన్నారు. నాన్ స్టాప్ గా 24 గంటల పాటు ఈ కార్యక్రమం జరగడంతో ఈ కార్యక్రమం పలు ప్రపంచ రికార్డులలో నమోదు కానున్నట్లు తెలిపారు. జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి మాట్లాడుతూ పాల్గొన్న కవులు కళాకారులు అందరికీ ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ కళావేదిక జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శి డాక్టర్ టీ పార్థసారథి, జాతీయ కార్యదర్శి రిషి తణుకు, స్థానిక నాయకులు కొట్టు విశాల్, బొడ్డు సాయి బాబా, గారపాటి వీరకుమార్, రాజా త్రినాథ్, కర్రి భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?






