కావలి నియోజకవర్గం సిరిపురం లో విషాదం

సిరిపురంలో విషాదం
కావలి, జనసాక్షి: కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న వాహనం పల్నాడు జిల్లా పిడుగురాళ్ల వద్ద ప్రమాదవశాత్తు చెట్టుకు ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతి చెందడంతో సిరిపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి స్పందించారు. ఆయన సహకారంతో మృతదేహాలను స్వగ్రామమైన మండలంలోని సిరిపురం కు తరలించి క్షతగాత్రులను పలు ఆసుపత్రులలో చేర్పించారు. ఈ ప్రమాదంలో తుళ్లూరు సురేష్(37), తుళ్లూరు వనిత(32), ఏబులు(65), పెద్ద తిరుపతయ్య(50)లు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎమ్మెల్యే దగుమాటి వెంకట వెంకట కృష్ణారెడ్డి సోమవారం ఆ గ్రామానికి చేరుకుని సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు ఆర్ధిక సాయం అందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడం దురదృష్టకరమని ఆవేదన చెందారు. సురేష్, వనిత దంపతుల పిల్లలకు ప్రభుత్వం అండగా ఉండి ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, గ్రామస్థులు సంతాపం తెలిపారు.
What's Your Reaction?






