గోదావరి కవితోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

Jul 15, 2024 - 13:54
 0  18
గోదావరి కవితోత్సవం  పోస్టర్ ఆవిష్కరణ

గోదావరి కవితోత్సవం పోస్టర్ ఆవిష్కరణ

 జనసాక్షి  త్రిపురాంతకం : ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో సోమవారం శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ చైర్మన్ డా.కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో కాకినాడలో జరగనున్న గోదావరి కవితోత్సవం పోస్టర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి గొట్టిముక్కుల నాసరయ్య ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా త్రిపురాంతకం మండల ఎంపీపీ   గొట్టిముక్కుల రిబ్కా ప్రసాద్ ఆవిష్కరించారు, శ్రీశ్రీ కళావేదిక కాకినాడ జిల్లా శాఖ,  జాతీయ కన్వీనర్ కొల్లి రమావతి, జాతీయ అధ్యక్షురాలు జి. ఈశ్వరీ భూషణం ఆధ్వర్యంలో జులై 21 తేదీన ఆదివారం పిఠాపురం రాజా కాలేజీలో జరగనున్న గోదావరి కవితోత్సవం, 137వ జాతీయ శతాధిక కవిసమ్మేళనం జరుగుతుంది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గుఱ్ఱం జాషువా అవార్డు గ్రహీత, బోయి భీమన్న జీవన సాఫల్య పురస్కార గ్రహీత, అంతర్జాతీయ శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ పాల్గొంటారని తెలిపారు , శ్రీశ్రీ కళావేదిక 28 ప్రపంచ రికార్డులతో దేశ విదేశాల్లో శాఖోపశాఖలుగా విస్తరించిందని, శ్రీశ్రీ కళావేదిక సభ్యులు సుమారు 20 వేల మంది ఉన్నారని తెలియజేశారు , కవులను, రచయితలను, కళాకారులను ప్రోత్సాహిస్తూ తెలుగు సాహిత్య అభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని తెలిపారు, ఈ కార్యక్రమంలో రామసముద్రం సర్పంచ్  పిచ్చయ్య, నీలం సురేష్, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow