పేద కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు అండగా ఉంటారు - ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

పేద కుటుంబాలకు సీఎం అండగా ఉంటారు - ఎంపీ వేమిరెడ్డి
- లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు అందించిన ఎంపీ వేమిరెడ్డి
నిరుపేదలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ అండగా ఉంటారని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. పలువురు లబ్ధిదారులకు మంజూరైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంగళవారం ఆయన తన నివాసంలో అందించారు. నెల్లూరు నగరానికి చెందిన చెంబేటి అనిల్ బాబు అనే వ్యక్తికి 1 లక్ష 43 వేలు, చంద్రశేఖర్ అనే వ్యక్తికి సంబంధించి 98 వేల రూపాయల విలువైన చెక్కులను సదరు లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు కావడం సంతోషంగా ఉందన్నారు. లబ్ధిదారుల సమస్యలపై వెనువెంటనే స్పందించి చెక్కులు రిలీజ్ చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా బాధితులు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆపదలో ఆదుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
What's Your Reaction?






